చావు డప్పు.. కొనసాగుతున్న నిరసనలు

చావు డప్పు.. కొనసాగుతున్న నిరసనలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. మేడ్చల్ మండల పరిధిలోని గౌడవెళ్ళి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుమేరకు వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను టీఆర్ఎస్ నేతలు దహనం చేశారు.  వరంగల్ జిల్లాలో కూడా నిరసనలు కొనసాగాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి  వినూత్న ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,నేతలు పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. స్వర్గ రథంపై ఊరేగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో విజయవాడల జాతీయ రహదారిపై చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

శంషాబాద్ నర్కుడ గ్రామంలోటీఆర్ఎస్ నిరసనలు కొనాసగాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జడ్పీటీసీ నిరటి రాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు రైతులు నర్కుడ చౌరస్తా లో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు టీఆర్ఎస్ శ్రేణులు. నిర్మల్ జిల్లా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి మంచిర్యాల చౌరస్తా వరకు టిఆర్ఎస్ నిరసన ర్యాలీ చేపట్టింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ, కేంద్రం ప్రభుత్వ దిష్టి బొమ్మ‌ల‌ను మంత్రి దగ్ధం చేశారు.

అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డోర్నకల్ ,మరిపెడ, కురవి, మండలాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా శవ యాత్ర..దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ కవిత,ఎంఎల్ఏ రెడ్యానాయక్ పాల్గొన్నారు.  జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయత్ర నిర్వహించారు. దిష్టి బొమ్మ  టీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు.

 

 

ఇవి కూడా చదవండి:

ఒమిక్రాన్ పేషంట్ కు సీరియస్

గాంధీలో ఒమిక్రాన్ అనుమానితుడు