
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లిలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారును అడ్డుకున్నారు టీఆర్ఎస్ నాయకులు. గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ లీడర్లను అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.