జీ 7 సమిట్ మధ్యలోనే వదిలివెళ్లిన డొనాల్డ్ ట్రంప్

జీ 7 సమిట్ మధ్యలోనే వదిలివెళ్లిన డొనాల్డ్ ట్రంప్

ఒట్టావా: కెనడాలో జరుగుతున్న జీ7 సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఇజ్రాయెల్, ఇరాన్​ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రంప్ హడావుడిగా బయలుదేరేఆరని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయెల్ మాక్రాన్ చెప్పారు. ఇలా వెళ్లిపోవడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ స్పందించారు. ఇజ్రాయెల్, -ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసమే ట్రంప్ జీ7 సమావేశం ముగియడానికి ఒకరోజు ముందే ట్రంప్ వెళ్లిపోయారని కామెంట్ చేశారు. "ఇజ్రాయెల్, -ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ఒక ప్రతిపాదన చేశారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌‌పై అమెరికా ఒత్తిడి చేస్తుంది. త్వరలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది" అని మాక్రాన్ పేర్కొన్నారు. 

మాక్రాన్ వ్యాఖ్యలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫాం ట్రూత్ సోషల్‌‌లో స్పందిస్తూ.. "ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ పబ్లిసిటీ కోసం పరితపిస్తున్నారు. నేను జీ7 సమావేశాన్ని విడిచి ఇజ్రాయెల్,-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం వాషింగ్టన్‌‌కు వెళ్తున్నానని చెప్పారు. అది పూర్తిగా తప్పు! నేను వాషింగ్టన్‌‌కు వెళ్లడానికి శాంతి ఒప్పందంతో సంబంధం లేదు. అంతకన్నా చాలా పెద్ద కారణం ఉంది. ఇమ్మాన్యుయెల్ ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటాడు. పబ్లిసిటీ కోసం పరితపిస్తుంటాడు" అని ట్రంప్ వివరించారు. అయితే, జీ7 సమిట్ నుంచి వెళ్లిపోవడానికి అసలైన కారణాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. వాషింగ్టన్‌‌లోని సిచ్యుయేషన్ రూమ్‌‌లో జాతీయ భద్రతా సిబ్బందితో సమావేశం కావాలని ఆదేశించినట్లు మాత్రం వైట్ హౌస్ అధికారి తెలిపారు.