అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. గత 25 ఏళ్లలో ఫోర్బ్స్ టాప్-400 జాబితాలో ఆయనకు స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి. డోనాల్డ్ ట్రంప్ ఆస్తులు విలువ సుమారు 2.5 బిలియన్ల డాలర్లు ఉంటుంది. అయితే కరోనా కారణంగా గతేడాది నుంచి ఆయన ఆస్తులు 600 మిలియన్ల డాలర్లు తగ్గింది. దీంతో ఫోర్బ్స్-400 జాబితాకు ట్రంప్ దూరమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆ జాబితాలో స్థానం దక్కించుకునేందుకు కనీసం 400 మిలియన్ల డాలర్లు తక్కువగా ఉన్నట్లు సమాచారం. తన నిర్ణయాల కారణంగానే ట్రంప్ ర్యాంక్ దిగజారిపోయినట్లు ఫోర్బ్స్ మ్యాగ్జిన్ తెలిపింది.
