
- ఈ నెల 10 వరకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఐసెట్ కన్వీనర్ అలువాల రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 51,857 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.