ఆధ్యాత్మికం : హనుమంతుడిని పూజించే సమయంలో చవాల్సిన మంత్రం.. అప్పుడే అనుకున్నది జరుగుతుంది..

ఆధ్యాత్మికం : హనుమంతుడిని పూజించే సమయంలో చవాల్సిన మంత్రం.. అప్పుడే అనుకున్నది జరుగుతుంది..

హనుమంతుడికి మంగళవారం నాడు చేసే పూజ అంటే ఎంతో ప్రీతికరం. ఆరోజున ఆంజనేయుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. స్వామికి సింధూర అభిషేకాలు, ఆకు పూజలు చేయిస్తుంటారు.  అన్ని బాధల నుంచి విముక్తి కలగాలంటే మంగళవారం.. ఆంజనేయస్వామి ఎదుట కొన్ని మంత్రాలను పఠించాలని  పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి అంటారు.  అంటే ఇప్పటికీ కూడా భూలోకంలోనే ఉన్నాడని నమ్ముతారు.  ఆయన అనుగ్రహం ఉంటే ధైర్యంతో పాటు సకల కార్యాల్లో విజయం కలుగుతుందని గ్రంథాల ద్వారా తెలుస్తుంది. 

 ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ విశ్వరూపాయ... అని పఠి స్తే చాలు.. హనుమంతుడితో పాటు శివుడి అనుగ్రహం కూడా కలుగుతందట.  తేజోవంతుడు.. బలవంతుడు.. రామ దూత.. పరాక్రమవంతుడూన హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయాలి.  ఇలా చేస్తే శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది.  ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. 

హనుమంతుడిని ఎలా పూజించాలంటే.. విధానం:

మంగళవారం నాడు హనుమంతుని మంత్రాలను జపించాలంటే ముందుగా ఏకాంత ప్రదేశంలో కూర్చోండి. మీ ముందు హనుమంతుని చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచండి. ఆ తర్వాత చందనం, సెంటు, అక్షంతలు , పుష్పాలు, ధూపం, దీపం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించాలి. పూజ తర్వాత, నీ చేతిలో నీళ్ళు తీసుకుని, హనుమంతునికి నీ హృదయ కోరికను చెప్పుకోవాలి. అప్పుడు హనుమంతుని మంత్రాన్ని జపించడం ప్రారంభించండి. మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. మీరు మీ జీవితంలోని అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందాలంటే, మంగళవారం నాడు హనుమంతునికి పూజించాలని పండితులు చెబుతున్నారు. 

ఆయనకి ఇష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు. ఈవిధంగా చేయడం వలన స్వామి ప్రీతి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు, దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతున్నవారు హనుమంతుడికి మంగళవారం పూజ చేస్తే రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. 

 గ్రహాలు అనుకూలంగాలేనప్పుడు అనేక ఇబ్బందులు పడుతుంటాం. నవగ్రహ దోష నివారణకు  మంగళవారం  హనుమంతుడిని పూజిస్తే..  మంచి జరుగుతుందట . ప్రతి మంగళవారం హనుమంతుడికి  ప్రదక్షిణలు చేయడం.. సుందరకాండ పారాయణం..  హనుమాన్ చాలీసా  చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెంది ప్రతికూల గ్రహాలను బలహీన పరుస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజ దోషం ఉన్నవారు ..  కుజుడు ... అటు శనిదేవుడితో ఇబ్బంది పడే వారికి కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.