విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు పంపిణీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు పంపిణీ :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ముంపు బాధిత విద్యార్థులకు అండగా నిలిచిన తుమ్మల యుగంధర్

ఖమ్మం రూరల్, వెలుగు :  ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఖమ్మం రూరల్ జలగం నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ముంపునకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.  ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి తుమ్మల స్కూల్​ను రూరల్ మండలం ఆరెంపులలోని మహమ్మదీయ కాలేజీ వద్దకు తరలించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తుమ్మల యువసేన ఆధ్వర్యంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ తన సొంత ఖర్చుతో స్టూడెంట్స్​కు శుక్రవారం నోట్ బుక్స్ అందజేశారు. తుమ్మల యువసేన తరఫున 250 స్కూల్ బ్యాగ్స్​ను అందజేసి తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడి విద్యా ప్రమాణాల పెంపునకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.