సీటీ స్కాన్కు వెళ్తే.. డ్రగ్ ఓవర్డోస్ తో వృద్ధురాలి మృతి

సీటీ స్కాన్కు వెళ్తే..  డ్రగ్ ఓవర్డోస్ తో వృద్ధురాలి మృతి
  • తేల్చిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్  

కూకట్​పల్లి, వెలుగు: వైద్య నిర్లక్ష్యం కేసులో ఇద్దరు నిందితులను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది మే 6న ఓ వృద్ధురాలు (66) రన్నింగ్ నోస్ ప్రాబ్లమ్​(ముక్కు నుంచి రక్తస్రావం)తో కేపీహెబ్​బీ కాలనీలోని మెడ్​క్వెస్ట్​డయాగ్నోస్టిక్స్​సెంటర్​కు వెళ్లింది. సీటీ స్కాన్ చేయడం కోసం అర్హత లేని ఇద్దరు సిబ్బంది బాధితురాలికి కాంట్రాస్ట్ డోసేజ్ ఇచ్చారు.

ఓవర్ డోస్ కారణంగా బాధితురాలికి గుండెపోటు వచ్చి మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో కాంట్రాస్ట్ డోస్ ఇచ్చిన సిబ్బంది శ్రీనివాస్​ఫణివర్మ(46), సుబ్రహ్మణ్యం ఉదయగిరి(38)లకు వైద్య ప్రక్రియ నిర్వహించే అర్హత లేదని తేలింది. పోస్టుమార్టం నివేదికలో కూడా వైద్య నిర్లక్ష్యం కారణంగానే వృద్ధురాలు మృతి చెందిదని నిర్ధారణ అయింది. దీంతో బుధవారం నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.