తొర్రూరు, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు ఆదర్శ పాఠశాలలో అండర్ -19 రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు శనివారం ఎంఈవో మహంకాళి బుచ్చయ్య, ఎస్ జీఎఫ్ఐ రాష్ట్ర పరిశీలకులు సమ్మయ్య లతో కలిసి క్రీడలను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఎస్ జీఎఫ్ఐ రాష్ట్ర కోఆర్డినేటర్ పివి రమణ పాల్గొన్నారు.
