
- మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు పన్ను భారం లేదు
కరోనా కష్టాలతో కుదేలైన మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల వారికి బడ్జెట్లో పన్నుల భారం నుండి ఉపశమనం లభించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే పన్ను రేట్లలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారని ఆశించినా వదిలేశారు. అలాగే ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారు ఏవైనా మార్పులు చేసుకోవాలంటే రెండేళ్లలోపు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులకు ఎన్‌పీఎస్ కింద పరిమితి పెంచారు.