పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్

పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్

కాసేపటి క్రితమే.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ సారి కూడా ఎర్రటి బ్యాగులో ఆమె బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు.  పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. 2022-23 వార్షిక బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెడతారు.  వరుసగా నాలుగో ఏడాది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలమ్మే. 

మరోవైపు  కోవిడ్ ఆంక్షలు కారణంగా రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభ రెండు షిఫ్ట్‌ల్లో సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశం కానుంది. బడ్జెట్‌ సమావేశాల్లో తొలి రెండు రోజుల్లో జీరో అవర్, క్వశ్చన్‌ అవర్‌ ఉండదు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 11వరకు తొలివిడత బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. రెండో విడత బడ్జెట్ సమావేశాలు  మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు కొనసాగుతాయి.