అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారు

అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారు
  • అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారు
  • 15న శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ నుంచి ఖమ్మం వయా భద్రాచలం


హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 15వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నందున రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. అమిత్ షా ప్రోగ్రామ్స్ వివరాలను కేంద్ర హోంశాఖకు పంపింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పార్టీ ఆఫీస్​లో ముఖ్య నేతలతో శనివారం సమావేశమయ్యారు. అమిత్​షా టూర్ షెడ్యూల్​పై చర్చించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 15వ తేదీన ఉదయం అమిత్ షా శంషాబాద్ ఎయిర్​పోర్టులో దిగగానే నోవాటెల్ హోటల్​కు వెళ్తారు. బీజేపీ సీనియర్ లీడర్లతో భేటీ అవుతారు. తర్వాత హెలికాప్టర్​లో భద్రాచలం వెళ్తారు. అక్కడ రాముడిని దర్శనం చేసుకుని ఖమ్మం వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుని రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్య నేతలతో చర్చిస్తారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. మళ్లీ అదే రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లిపోతారు. రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిన షెడ్యూల్​కు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.