కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (పారా మెడికల్) గ్రూప్–బి నాన్ గెజిటెడ్ (కాంబాటైజ్డ్), నాన్ -మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది.
పోస్టు పేరు: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (పారా మెడికల్).
మొత్తం ఖాళీలు: 7. ఏఎస్ఐ (రేడియోగ్రాఫర్) 3, ఏఎస్ఐ (ఫార్మాసిస్ట్) 2, ఏఎస్ఐ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) 1, ఏఎస్ఐ (డెంటల్ టెక్నీషియన్) 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి/ ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ, మాజీ సైనికులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 21.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 20
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssb.gov.inను సందర్శించండి.
