'యస్.. ఐ యామ్ అన్ స్టాపబుల్ టుడే'.. కాంగ్రెస్ విక్టరీ క్రెడిట్ మొత్తం రాహుల్‌ యాత్రకే

'యస్.. ఐ యామ్ అన్ స్టాపబుల్ టుడే'.. కాంగ్రెస్ విక్టరీ క్రెడిట్ మొత్తం రాహుల్‌ యాత్రకే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. విజయం దిశగా అడుగులు వేస్తోన్న కాంగ్రెస్.. దీనికి కారణం అంతా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం చేపట్టిన భారత్ జోడో యాత్రేనని పార్టీ వర్గాలు కొనియాడుతున్నారు. క్రెడిట్ అంతా రాహుల్ పాదయాత్రకే చెందుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో నడిచిన ఓ వీడియోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో రాహుల్ నడుస్తుండగా.. బ్యాగ్రౌండ్ లో  "అన్‌స్టాపబుల్" అనే ఇంగ్లీష్ సాంగ్ ప్లే అవుతోంది. దాంతో పాటు తాము ఎంతో కాన్ఫిడెంట్ తో ఉన్నామని, అవును (ఐ యామ్ అన్ స్టాపబుల్ టుడే) ఈ రోజు నన్ను ఎవరూ ఆపలేరు అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది.

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా తెచ్చుకున్న కాంగ్రెస్.. కర్ణాటకలో 38 ఏళ్ల ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. కర్ణాటకలో 1985 తర్వాత ఏ అధికార పార్టీ వరుసగా రెండోసారి మళ్లీ అధికారంలోకి రాలేదు. ఇదిలా ఉండగా కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు సాగిన ఓట్ల లెక్కింపును బట్టి చూస్తే.. కాంగ్రెస్ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 72 సీట్లలో లీడ్ లో ఉంది. ఇక జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు 5 చోట్ల లీడ్ లో ఉన్నారు.

https://twitter.com/INCIndia/status/1657221192741441537