
- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థ పరిధిలో అమృత్ 0.2 కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లయ్కోసం రూ.400 కోట్ల నిధులు మంజూరయ్యాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన గంగాస్థాన్ ఫేజ్-1లో పనులను పరిశీలించి మాట్లాడారు.
మొత్తం 150 మ్యాన్ హోల్స్ రిపేర్ చేసి కొత్తగా 45 నిర్మించామన్నారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పనుల్లో స్పీడ్ పెంచాలని సూచించారు. ఏడాదిన్నర కాలంలో ప్రతి ఇంటికీ డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈ నగేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఆనంద్‌రావు, సాయి ప్రవీణ్, పవన్ తదితరులు ఉన్నారు.