ముంబై లోని వ్యాక్సిన్ సెంటర్లలో నో స్టాక్ బోర్డులు

ముంబై లోని వ్యాక్సిన్ సెంటర్లలో నో స్టాక్ బోర్డులు

కరోనా టీకాలు వేయించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడం.. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండడంతో ముంబైలో టీకాలు అయిపోతున్నాయి.

ముంబైలో 120 వ్యాక్సిన్ సెంటర్లలో టీకాలు వేస్తుండగా.. ఇప్పటికే 26 కేంద్రాల్లో టీకాలు అయిపోయినట్టు అదనపు మున్సిపల్ కమిషనర్ సురేశ్ కాకానీ చెప్పారు. ఇవాళ(గురువారం) సాయంత్రం వరకు మరో 20 కేంద్రాల్లో ఖాళీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. రేపు(శుక్రవారం)మరో 25 సెంటర్లలో వ్యాక్సిన్లు అ ఖాళీ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

ఇప్పటికే ముంబైతో పాటు మహారాష్ట్రలోని సాంగ్లీ, సతారా, గోండియా, చంద్రాపూర్ లలోనూ వ్యాక్సిన్ల కొరత ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు.