Sunrisers Hyderabad: గంటకు 150 కి.మీ వేగంతో బంతులు: సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్

Sunrisers Hyderabad: గంటకు 150 కి.మీ వేగంతో బంతులు: సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్

ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించింది. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ సోమవారం (జూలై 14) ప్రకటించింది. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో వరుణ్ ఆరోన్‌ బౌలింగ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. "మా కోచింగ్ సిబ్బందిలో చేరిన మా కొత్త బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్‌కు స్వాగతం" అని సన్‌రైజర్స్ హైదరాబాద్ వారి ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. 

ఆరోన్ 2011 నుంచి 2022 మధ్య తొమ్మిది సీజన్లు ఐపీఎల్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరోన్ తన చివరి సీజన్‌  గుజరాత్ టైటాన్స్‌తో 2022లో ఆడాడు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ లో 52 మ్యాచ్ లాడిన ఈ పేసర్ 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

►ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్ చీప్ ట్రిక్స్.. పరుగు తీస్తుంటే జడేజాను అడ్డుకున్న కార్స్

35 ఏళ్ల ఆరోన్ ఈ ఏడాది ప్రారంభంలో తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుణ్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. 2011 లో  ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ పై తొలిసారి భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. అదే సంవత్సరం నవంబర్ లో వెస్టిండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా తరపున కేవలం 9 టెస్టులు.. 9 వన్డేలు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 18 వికెట్లు తీసిన ఆరోన్ వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తరవాత పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో స్థానం కోల్పోయాడు. 

2015 లో చివరిసారిగా భారత జట్టు తరపున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టెస్టులో ఆరోన్ పెద్ద రాణించకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ పదేళ్లలో ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడుతూ వచ్చాడు.