ప్రజాసేవలో నా తండ్రే నాకు స్పూర్తి: వీరప్పన్ కూతురు

ప్రజాసేవలో  నా తండ్రే నాకు స్పూర్తి: వీరప్పన్ కూతురు

ప్రజాసేవలో తన తండ్రే తనకు స్ఫూర్తి అని తెలిపారు గందపు చక్కల స్మగ్లర్  వీరప్పన్ కూతురు విద్యారాణి. తమిళనాడు కృష్ణగిరి  లోక్ సభ నియోజకవర్గం నుంచి నామ్ తమిళార్ కచ్చి పార్టీ (ఎన్టీకే)  తరపున లోక్ సభకు పోటీ చేస్తున్న విద్యారాణి  కృష్ణగిరిలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ప్రజా శ్రేయస్సుకు, సమాజాభివృద్ధికి కృషి చేసే పార్టీ నుంచి తాను పోటీ చేస్తున్నారన్నారు. తన తండ్రి స్ఫూర్తితోనే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాన్నారు. ప్రజలకు కావాల్సింది చేయలేని  ఆనాటి ప్రభుత్వాలు.. తన తండ్రిపై అసత్య ఆరోపణలు మోపారని తెలిపారు. ప్రజల కోసం తన తండ్రి నిలబడ్డారని.. పోరాడారని తెలిపారు విద్యారాణి. 

తాను ఎంపీగా గెలిస్తే ప్రజల కోసం పాటుపడే ఏ పార్టీకైనా మద్దతిస్తానని చెప్పారు. నియోజక వర్గంలోని రైతులు, మహిళలకు సాధికారత కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.  క్రిష్ణగిరి ప్రజల గళం వినిపించేందుకు తనను ఎంపీగా గెలిపించాలన్నారు. తక్కువ నీటి వసతి, నీటి సౌకర్యం ఉన్న ఈ ప్రాంతం ఎక్కువ రైతుల భూమి. అలాగే, చదువుకున్న వారు కానీ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఋ సమస్యపై తాను  మరింత దృష్టి పెట్టాలనినుకుంటానని చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించాలనుకుంటున్నట్లు తెలిపారు. 

కృష్ణగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి మొత్తం 26 మంది అభ్యర్థులు తమ  నామినేషన్  పత్రాలను దాఖలు చేశారు.  అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తున్నాయి. కూటమి అభ్యర్థిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హోసూరు ఎమ్మెల్యే కె.గోపీనాథ్‌ను కాంగ్రెస్‌ ప్రకటించింది.  మిగతా వారిలో అన్నాడీఎంకే అభ్యర్థి, బీజేపీ నుంచి ఎన్డీయే అభ్యర్థి, 23 మంది స్వతంత్రులు కృష్ణగిరిలో ఎన్నికల బరిలో ఉన్నారు.

తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.2019 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 39 స్థానాలకు గాను 38 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించింది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.