రాజన్న ఆలయంలో కార్తీక రద్దీ.. భీమేశ్వరాలయంలో కోడె మొక్కులు

రాజన్న ఆలయంలో కార్తీక రద్దీ.. భీమేశ్వరాలయంలో కోడె మొక్కులు

వేములవాడ, వెలుగు : ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సందడి నెలకొంది. కార్తీకమాసం ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

 ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఒకే క్యూ లైన్ లో భక్తులకు రాజన్న ఆలయంలో లఘు దర్శనానికి అనుమతించారు. ఆలయం ముందు మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులతో భీమేశ్వరాలయం రద్దీగా మారింది. స్వామి  వారి ఆలయంలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.