ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి : మామిడాల యశస్వినిరెడ్డి

ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి : మామిడాల యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు: ఆర్టీసీ అందిస్తున్న మెరుగైన సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. శనివారం తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు రాజధాని ఏసీ బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు తొర్రూరు వయా తిరుమలగిరి, మోత్కూరు మీదుగా హైదరాబాద్​ పట్టణానికి సర్వీసులు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

అంతకుముందు హరిపిరాల గ్రామంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు సుంచు సంతోష్​ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్​ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి రాష్ర్ట ముదిరాజ్​కార్పొరేషన్​ చైర్మన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్​ కార్యక్రమం పాలకుర్తి ఇన్​చార్జి బొర్రా జ్ఞానేశ్వర్​ ముదిరాజ్​తో కలిసి పాల్గొన్నారు. ​​​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్​ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, పార్టీ పట్టణాధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.