Vijay Deverakonda: మేడ్ ఫర్ ఇండియా: భారత సైన్యానికి విజయ్ దేవరకొండ విరాళం..

Vijay Deverakonda: మేడ్ ఫర్ ఇండియా: భారత సైన్యానికి విజయ్ దేవరకొండ విరాళం..

ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ విరాళం ప్రకటించారు. ‘అపరేషన్‌ సిందూర్‌’నేపథ్యంలో భారత సైన్యానికి తన వంతు బాధ‍్యతగా విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్నాడు.

శుక్రవారం మే9న విజయ్‌ పుట్టినరోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసి ‘మేడ్‌ ఇన్‌ ఇండియా మాత్రమే కాదు..మేడ్‌ ఫర్‌ ఇండియా’ అంటూ పోస్ట్‌ పెట్టాడు. 

రౌడీ బ్రాండ్ పేరుతో ఉన్న తన క్లాత్‌ సేల్స్‌లో వచ్చే లాభాల్లో కొంత వాటాను ఇండియన్‌ ఆర్మీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు వీడియోలో వెల్లడించాడు. పుట్టినరోజు కేవలం వేడుకల గురించి మాత్రమే కాదు. మనలోని ఆనందాన్ని పంచుకోవడం గురించి కూడా. కానీ, భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య మనందరం ఎంతో సపోర్ట్ గా ఉండాలి. ఎందుకంటే, మనకు అన్నీ ఇచ్చిన దేశానికి తిరిగి ఇవ్వడం మన బాధ్యత అని విజయ్ తెలిపారు. 

హీరో విజయ్ దేవరకొండ నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. గతంలో కరోనాతో పాటు వివిధ విపత్తుల సమయంలో ఆయన ఎంతోమందికి సాయం చేసి అండగా నిలిచాడు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి తన వంతు కర్తవ్యంగా భరోసా ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ నటిస్తున్న చిత్రాలనుంచి అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ ఇచ్చారు మేకర్స్. విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి తీస్తున్న ‘కింగ్‌‌‌‌డమ్’చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేశారు. మే 30న విడుదల కానుంది.

మరోవైపు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. విజయ్‌‌‌‌కు జంటగా రష్మిక మందన్న నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

అలాగే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఇటీవల ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి  తెలిసిందే. ‘రౌడీ జనార్థన్’టైటిల్‌‌‌‌తో తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి ఇంటెన్స్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో విజయ్‌‌‌‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలియజేశారు.