Sir Madam Trailer: సార్ మేడమ్ల లవ్‌‌స్టోరీ.. పెళ్లిచూపులతో మొదలై విడాకుల వరకు..

Sir Madam Trailer: సార్ మేడమ్ల లవ్‌‌స్టోరీ.. పెళ్లిచూపులతో మొదలై విడాకుల వరకు..

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’.పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్  నిర్మించారు. తెలుగులో ఈ చిత్రం ‘సార్‌‌‌‌ మేడమ్‌‌’పేరుతో విడుదల కానుంది. గురువారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.

తన తల్లిదండ్రులను మరపించేలా చూసుకుంటానని పెళ్లైన కొత్తలో భార్య నిత్యామీనన్‌‌కు మాటిస్తాడు విజయ్ సేతుపతి. అతనో పరోటా మాస్టర్. ఇద్దరూ కలిసి హోటల్ నడుపుతుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు జరుగుతుంటాయి. మాస్‌‌ యాక్షన్‌‌ సీన్స్‌‌కు ఏమాత్రం తగ్గని ఈ గొడవలు చూసేవాళ్లకు చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటాయి.

పెళ్లిచూపులతో మొదలై విడాకుల వరకు వచ్చిన ‘సార్‌‌‌‌ మేడమ్‌‌’ల కథ ఆ తర్వాత ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగతా కథ.  విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌‌ల ఆన్‌‌ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ మేజర్‌‌‌‌ హైలైట్‌‌గా నిలిచింది.

యోగి బాబు, ఆర్కే సురేష్, చెంబన్ వినోద్ జోస్, శర్వణన్, దీప ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ నెల 25న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.