అందరూ కలిసిమెలిసి పండుగ నిర్వహించుకోవాలి

అందరూ కలిసిమెలిసి పండుగ నిర్వహించుకోవాలి

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ అదరూ కలిసిమెలిసి ప్రతి పండుగను నిర్వహించుకోవాలని బీజేపీ జాతీయ  కార్యవర్గ సభ్యురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. తాను ఐదు రోజుల నుంచి దుర్గా మాత అమ్మవారి పూజలు నిర్వహించానని తెలిపారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని లోని మారుతి నగర్ లో  ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.  విజయశాంతి రావడంతో స్థానిక మహిళలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నానని చెప్పారు.