జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్

జీపీ ఎన్నికలు  పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
  • వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​ జైన్

వికారాబాద్, వెలుగు: జిల్లాలో జరుగనున్న గ్రామపంచాయతీ  ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్  సూచించారు. బుధవారం కలెక్టరేట్​నుంచి ఆయన నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. జిల్లాలో మొదటి విడతలో 8 మండలాల్లో 262 గ్రామ పంచాయతీలు, 2,198 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా, 2,198 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 ఎన్నికల వేళ ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే 8416235291 హెల్ప్ లైన్ నంబర్​కు ఫోన్​ చేయాలన్నారు. మండలాలవారీగా క్లస్టర్లు, నామినేషన్ల ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్​ టీంలు లోకల్ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు.