
- తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య
వికారాబాద్, వెలుగు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ఈ ఘటన మోమిన్‌పేట మండలంలోని కేసారంలో చోటుచేసుకుంది. సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్(36), రేణుక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
భార్యాభర్తలు కేసారంలోని ఓ వెంచర్‌లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో కుమార్ప్రతీరోజు మద్యం తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. ఆదివారం కూడా మద్యం మత్తులో వచ్చి తిడుతూ చంపేస్తా అని బెదిరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన రేణుక భర్త కుమార్ కళ్లలో కారం చల్లి, కేబుల్ వైర్ ను గొంతుకు బిగించి హత్య చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.