ఇందిరమ్మ ఇండ్లు రాలేదని పురుగు మందు డబ్బాలతో ఆందోళన

ఇందిరమ్మ ఇండ్లు రాలేదని పురుగు మందు డబ్బాలతో ఆందోళన

కమలాపూర్, వెలుగు: అన్ని అర్హతలున్నా తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని అంబాలకు చెందిన కొందరు పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు అడిషనల్ కలెక్టర్​  వెంకట్​ రెడ్డి హాజరయ్యారు. పలువురు గ్రామస్తులు తమకు ఇండ్లు కేటాయించాలంటూ పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. తాము 30 ఏండ్లుగా కిరాయి ఇండ్లలో ఉంటున్నామని, తమకు కాదని అనర్హులకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. వెంటనే న్యాయం చేయాలని కోరారు.