
నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని మోపాల్ మండలం కాల్పోల్ తండాలో వైరల్ జ్వరాల వ్యాప్తి కలకలం రేపింది. ప్లేట్లెట్స్ తగ్గి 13 మంది గిరిజనులు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరిన సమాచారం తెలిసి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అలర్ట్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్‌వో రాజశ్రీ నేతృత్వంలో శనివారం తండాలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
తండాలో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. 152 మందికి ఆర్డీటీ నిర్వహించి ఏడుగురు బ్లడ్ శాంపిళ్లను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు పంపారు. ఇండ్ల పరిసరాల్లో దోమల వ్యాప్తిని అరికట్టే యాంటీ లార్వల్ చర్యలు తీసుకున్నారు. మలేరియా ఆఫీసర్ డాక్టర్ తుకారాం రాథోడ్, సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజ్, ఎపిడమాలజిస్టు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ అజ్మల్, డాక్టర్ ప్రత్యూష, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.