చిన్నపిల్లాడిలా కోహ్లీ ప్రవర్తన.. చూస్తే ముచ్చటేయాల్సిందే

చిన్నపిల్లాడిలా కోహ్లీ ప్రవర్తన.. చూస్తే ముచ్చటేయాల్సిందే


టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటాడో.. ఫీల్డింగ్ లోను అంతే ఎనర్జీ ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లను ప్రోత్సహించడం, వికెట్ పడితే సెలబ్రేషన్ లో చూపించే అగ్రెస్సివ్ నెస్ ఇతర ఆటగాళ్లకు మంచి కిక్ ఇస్తాయి. ఇక తాజాగా శ్రీలంకపై కింగ్ చేసిన విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 

రోహిత్ ని హద్దుకున్న కోహ్లీ
 ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 మ్యాచులో నిన్న భారత్ శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఘానా విజయం సాధించింది. బ్యాటింగ్ లో విఫలమైనా.. బౌలింగ్ ఫీల్డింగ్ లో అదరగొట్టింది. ఇక ఈ మ్యాచులో శ్రీలంక బ్యాటింగ్ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రవీంద్ర జడేజా బౌలింగ్​లో షనక ఇచ్చిన క్యాచ్​ను స్లిప్​లో ఉన్న రోహిత్​ అద్భుతంగా డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో విపరీతమైన ఆనందంతో క కోహ్లీ హిట్​మ్యాన్​ను గట్టిగా హద్దుకున్నాడు. రోహిత్ కూర్చున్నప్పుడే విరాట్.. రోహిత్ ని  హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది.

చిన్న పిల్లాడిలా కోహ్లీ చేసిన ఈ పనికి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియో చూస్తే కోహ్లీ అందరితో ఎంత స్పోర్టీవ్ గా ఉంటాడో, గెలుపు కోసం ఎంత తపిస్తాడో అర్ధం అవుతుంది. ఈ ఒక్క హగ్ తో విరాట్-రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయని భావించిన వారికి కూడా కోహ్లీ చెక్ పెట్టేసాడు.