ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్..టాప్ 10లో ఇండియన్ స్టార్ బ్యాటర్స్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్..టాప్ 10లో ఇండియన్ స్టార్ బ్యాటర్స్

ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సత్తా చాటారు. 9 వ స్థానంలో ఉన్న విరాట్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి 10వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో సత్తా చాటిన కోహ్లీ ఖాతాలో 775 రేటింగ్ పాయింట్లు ఉంటే.. రోహిత్ ఖాతాలో 748 పాయింట్లు ఉన్నాయి. 

న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియంసన్ టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. 864 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ స్టార్ రూట్ రెండో ర్యాంక్ లో ఉన్నాడు. స్మిత్ మూడు, లబుషేన్ నాలుగో ర్యాంక్ లో ఉన్నారు. చాలా నెలలుగా టాప్ 10 లో ఉంటూ వస్తున్న ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. పాక్ యువ సంచలనం  సౌద్ షకీల్ టాప్-10 నుంచి నిష్క్రమించారు. బాబర్ అజామ్ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌ తో సరిపెట్టుకున్నాడు. 

బౌలింగ్ విషయానికి వస్తే.. టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ లో12 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానాల్లో నిలిచాడు. జడేజా మూడో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ రెండో స్థానాల్లో ఉన్నారు. టీమ్స్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో నిలిచింది.