చైనాలో జంతువుల నుంచి మనుషులకు వైరస్

 చైనాలో జంతువుల నుంచి మనుషులకు వైరస్

చైనాలో మరో కొత్త వైరస్ బయటపడింది. చైనాలో జంతువుల నుంచి మరో వైరస్ మనుషులకు సోకింది. యానిమల్స్ నుంచి వ్యాపించే హెనిపా వైరస్ ఇటీవల షాంగ్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ ల్లో కొందరికి వ్యాపించినట్లు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న పేషంట్ల నుంచి సేకరించిన స్వాబ్ లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపింది గ్లోబల్ టైమ్స్. ఈ వైరస్ కు లాంగ్యా హెనిపా వైరస్ గా పేరు పెట్టారు. బాధితుల్లో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం, అనోరెక్సియా వంటి లక్షణాలు కనిపించాయి.

హెనిపా వైరస్ బయెసేఫ్టీ లెవల్-4 వైరస్ గా పేర్కొంది గ్లోబల్ టైమ్స్. మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని తెలిపింది. దీనిలో 40 నుంచి 75 శాతం వరకు మరణాలు ఉండొచ్చని తెలిపింది. హెనిపావైరస్ వ్యాప్తి నివారణకు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. కేవలం లక్షణాలను బట్టే బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటివరకు 35 మందికి వైరస్ సోకినట్లు గుర్తించిన అధికారులు. . ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా, మంకీపాక్స్ వైరస్‌లు కలకలం సృష్టించగా.. ఇప్పుడు మరో మహమ్మారితో ప్రజల్లో ఆందోళన మొదలైంది. జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.