చైనా కంపెనీకి రూ.200 కోట్ల కాంట్రాక్టు ఇచ్చిన వొడాఫోన్ ఐడియా

చైనా కంపెనీకి రూ.200 కోట్ల కాంట్రాక్టు ఇచ్చిన వొడాఫోన్ ఐడియా

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా ఇటీవల చైనా కంపెనీ జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఈకి దాదాపు రూ. 200 కోట్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ గేర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, -ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్  టెలికం సర్కిళ్లలో బ్రాడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ పరికరాల కోసం కంపెనీ ఆర్డర్లు  ఇచ్చింది.  టెలికం పోర్టల్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సిఎస్)  జెడ్​టీఈ టెలికాం గేర్‌‌‌‌‌‌‌‌లకు అనుమతి మంజూరు చేసింది.  భద్రతపై కేబినెట్ కమిటీ, డిసెంబరు 16, 2020న  టెలికమ్యూనికేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్‌‌‌‌‌‌‌‌ను ఆమోదించింది.

నమ్మకమైన కంపెనీల నుంచి మాత్రమే టెలికం పరికరాలను కొనాలని ఇది సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది.  ఈ డైరెక్టివ్​   టెలికం నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్ కోసం కొన్ని సంస్థల పేర్లను సూచించింది. ఈ వివరాలన్నీ టెలికాం పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయి.  డిప్యూటీ నేషనల్​సెక్యూరిటీ అడ్వైజర్​ నేతృత్వంలోని కమిటీ ఈ పేర్లను ఖరారు చేస్తుంది. ఇది సిఫార్సు చేసిన లిస్టులో లేకపోవడంతో కొన్ని చైనీస్ కంపెనీలు 5జీ టెలికాం గేర్ కోసం ఆర్డర్‌‌‌‌‌‌‌‌లను పొందలేకపోయాయి. జెడ్​టీఈ టెలికం పరికరాలను స్వీడన్​, బ్రిటన్​ వంటి కొన్ని దేశాలు నిషేధించాయి.