గుండెకు మేలు చేసే 6 సూపర్ ఫుడ్స్: కొలెస్ట్రాల్, బిపి తగ్గాలంటే ఇవి తినండి!

గుండెకు మేలు చేసే 6 సూపర్ ఫుడ్స్: కొలెస్ట్రాల్, బిపి తగ్గాలంటే ఇవి తినండి!

మీ గుండెను బలంగా, దృడంగా ఉంచుకోవాలంటే ఒమేగా-3 వంటి మందులు (సప్లిమెంట్లు) సహాయపడతాయి. కానీ మీరు ప్రతిరోజూ తినే ఆహారమే ఎక్కువ మార్పు తీసుకువస్తుంది. మనం సాధారణంగా తీసుకునే చాలా ఆహారాల్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, వాపును అదుపు చేసి, గుండె బాగా పనిచేయడానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. గుండెకు నిజంగా మంచి చేసే ఆరు ముఖ్యమైన ఆహారాల గురించి  డాక్టర్ కునాల్ సూద్ వివరించారు. ఈ ఆహారాలు గుండెను రక్షించడానికి ఎలా ఉపయోగపడతాయో  కూడా చెప్పారు. 

 గుండెకు మేలు చేసే 6 ఆహారాలు:
సాల్మన్ ఫిష్ : సాల్మన్ చేప వంటి   చేపల్లో ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి, గుండె లయను స్థిరంగా ఉంచుతాయి, రక్త నాళాలను మెరుగుపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే గుండె సమస్యలు తగ్గుతాయి.

ఆలివ్ ఆయిల్  (Olive Oil):  ఆలివ్ ఆయిల్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గిస్తాయి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలివ్ ఆయిల్ తో చేసే ఆహారం తింటే గుండె జబ్బులు, మరణాలు తగ్గుతాయి.

అవకాడో (Avocados): అవకాడోలలో ఆరోగ్యకరమైన కొవ్వులు (ఒలీక్ ఆమ్లం), ఫైబర్, పొటాషియం, విటమిన్ E ఉంటాయి. ఈ పోషకాలు మంచి కొలెస్ట్రాల్ ఇంకా సరైన రక్తపోటు స్థాయిలకు సపోర్ట్ ఇస్తాయి.

వాల్‌నట్స్ (Walnuts): వాల్‌నట్‌లను తరచుగా తీసుకోవడం గుండెకు మంచిది. వీటిలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి ఇంకా రక్త నాళాలు బాగా పనిచేస్తాయి.

బ్లూబెర్రీస్ (Blueberries): బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

 ఆకుకూరలు: పాలకూర వంటి  ఆకుకూరల్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్లో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్ వంటివి గుండెను ప్రమాదాల నుంచి కాపాడతాయి.

మీ ఆరోగ్యం మీ ప్లేట్ నుండే  మొదలవుతుందని అంటారు. మీ ప్లేట్ లో ఏముందో మీకు తెలిసిన తర్వాత, సగం విజయం సాధించినట్లే. కాబట్టి ఆరోగ్యకరమైన గుండె కోసం ఈ  ఆహారాలను మీరు తినే ఆహారంలో చేర్చుకొండి...