మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం : కలెక్టర్ సత్య శారదా దేవి

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం  : కలెక్టర్ సత్య శారదా దేవి

గ్రేటర్​ వరంగల్/ కాశీబుగ్గ, వెలుగు: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని వరంగల్​ కలెక్టర్​ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన జిల్లా నార్కోటిక్​ కమిటీ మీగింగ్​లో కలెక్టర్​ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా నియంత్రణ నివారణపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో, కాలేజీల ప్రాంగణంలో విద్యార్థులకు మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలని పోలీస్​ ఆఫీసర్లను ఆదేశించారు. 

కార్యక్రమంలో ఏసీపీలు శుభం, రవీందర్ రెడ్డి, నరసయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీలోని పోతన ఆడిటోరియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో భాగంగా వివేకానందుడి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారిని అభినందించి, బహుమతులను అందజేశారు. వివేకానందుడి స్ఫూర్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.