నర్సంపేట, వెలుగు: కుటుంబ కలహాలతో వరంగల్ జిల్లాకు చెందిన ఎస్బీ ఎస్సై ఎండీ ఆసీఫ్(60) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసీఫ్ ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో ఎస్బీ ఎస్సైగా పని చేస్తున్నాడు.
నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్‌కు చెందిన ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగగా, ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. ఆసీఫ్ మృతితో పోలీసుశాఖతో పాటు నర్సంపేట పట్టణంలో విషాదం నెలకొంది.
