లక్ష కోట్లు పెట్టి ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తున్నాం

లక్ష కోట్లు పెట్టి ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తున్నాం
  • మరి బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలి  – మంత్రి హరీష్ రావు 
  • అసెంబ్లీకి డుమ్మా కొట్టి హుజూరాబాద్ లో తిష్ట వేసిన మంత్రి హరీష్ రావు

కరీంనగర్: రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందని, రైతుల వద్ద ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోవద్దు.. రైతు రుణాల వడ్డీ నీ ప్రభుత్వమే కడుతుందాని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పింది.. మరి బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంలోని వెంకట సాయి గార్డెన్ ఫంక్షన్ హాలులో  విత్తన ఉత్పత్తి రైతులతో మంత్రి హరీశ్ రావు సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక్క మహిళ భవనం, ఒక్క డబుల్ బెడ్ రూమ్ కట్టలేదని ఆరోపించారు. ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు మంజూరు చేశామని, హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర మంత్రి గా పని చేస్తున్నానని చెప్పారు.  ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. 
అసెంబ్లీకి డుమ్మాకొట్టి హుజూరాబాద్ లో వరుస సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనా మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఆయా వర్గాల వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజిబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల కోట్లు తీసుకొస్తా.. పెంచిన ధర తగ్గిస్తా అని చెప్పగలరా అని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం మాత్రం వచ్చే మార్చి బడ్జెట్ లో మిగితా రైతు రుణాల మాఫీ చేస్తుందని, రెండున్నర సంవత్సరాల కోసం గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఉద్యమకారుడు బీద కుటుంబం నుండి వచ్చిన గెళ్లు శ్రీనివాస్ కు ఓటు వేయాలన్నారు. ఈ రోజు మీటింగ్ కు గేల్లు శ్రీనివాస్ కు ఒక్క రూపాయి ఖర్చు కాలేదని, అంతా కార్యకర్తలే ఖర్చు పెట్టికున్నారని తెలిపారు. రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారికి రాబోయే రెండు నెలల్లో పెన్షన్ లు ఇస్తామని, కరోనా వాళ్ల ఆర్థిక ఇబ్బందులతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవం అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే ఢిల్లీకి పోవాల్సి వస్తుందని, కరీంనగర్ ఎంపీగా గెలిచి ఒక్క పని చేయలేదని విమర్శించారు.