నల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం

నల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం
  • ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించిన అధికారులు 

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంతో చెంచులు తరించారు.  ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో   ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం దేవస్థాన ధర్మకర్తల మండలి లాంఛనంగా చేపటింది. ముందుగా ఉమా రామలింగేశ్వర ఆలయం వద్ద చెంచులను మేళతాళాలతో అధికారులు స్వాగతించారు.  శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం, అమ్మవారికి పూజలు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడంతో  చెంచులు భావోద్వేగానికి లోనయ్యారు.

 భక్తిపారవశ్యంతో నృత్యాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయించి స్వామివారి స్పర్శ దర్శనం చేయించారు.  ఇక ముందు ప్రతి నెలలో ఒక రోజు చెంచులకు మల్లన్న స్పర్శ దర్శనం కల్పించనున్నారు.  ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేశ్ నాయుడు , మేకలబండకు చెందిన ధర్మకర్తల మండలి సభ్యురాలు జి. గంగమ్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.