ఎనర్జిటిక్ ఇయర్ఎండ్కు భాగ్య నగరం రెడీ.. హైదరాబాద్ బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్‌‌‌‌కు సన్నీ లియోన్

ఎనర్జిటిక్ ఇయర్ఎండ్కు భాగ్య నగరం రెడీ.. హైదరాబాద్ బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్‌‌‌‌కు సన్నీ లియోన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025కి వీడ్కోలు పలికి, 2026ని ఘనంగా స్వాగతం పలకడానికి నగరం సిద్ధమైంది. లగ్జరీ హోటల్స్ నుంచి హై-ఎనర్జీ నైట్‌‌‌‌క్లబ్స్ వరకు.. ఓపెన్ -ఎయిర్ ఫెస్టివల్స్ నుంచి రిసార్ట్ స్టైల్ పార్టీల వరకు.. సిటీలో 300కు పైగా భారీ ఈవెంట్లు జరగనున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు, ఫేమస్ డీజేలు, పాపులర్ సింగర్లు పాల్గొననున్న ఈ వేడుకలు నగరాన్ని మరింత  ఎనర్జిటిక్​గా మార్చనున్నాయి.

లైవ్ డీజేలతో ఫుల్ జోష్
హైదరాబాద్ ఎంటర్​టైన్​మెంట్ హబ్​గా  మారిన నేపథ్యంలో ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్లు మరింత గ్రాండ్‌‌‌‌గా జరుగనున్నాయి. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో జరుగుతున్న హైదరాబాద్ బిగ్గెస్ట్​ NYE 2026 ఈవెంట్‌‌‌‌కు బాలీవుడ్ సెన్సేషన్ సన్నీ లియోన్ రానున్నది. ఇక్కడే సింగర్ రామ్ మిరియాల లైవ్ పర్ఫార్మెన్స్‌‌‌‌ ఇవ్వనున్నాడు.

ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్‌‌‌‌లో 'ది ప్రిజమ్ సర్కస్ NYE 2026 పేరుతో భారీ పార్టీ జరుగుతోంది. ఇక్కడ రెసిడెంట్ డీజేలతో పాటు స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్, కాన్ఫెటీ బ్లాస్ట్, ఫైర్‌‌‌‌వర్క్స్ డిస్‌‌‌‌ప్లే వంటివి పార్టీ జోష్‌‌‌‌ను పెంచనున్నాయి. ఇతర పాపులర్ క్లబ్స్ అయిన అమ్నీషియా లాంజ్ బార్, ఫైర్‌‌‌‌ఫ్లై క్లబ్, ప్లేబాయ్ క్లబ్, కొమ్మా వంటివి కూడా హై-ఎనర్జీ డీజే నైట్స్‌‌‌‌తో సందడి చేయనున్నాయి.

లగ్జరీ హోటల్స్ అయిన తాజ్ కృష్ణ, పార్క్ హయత్, మారియట్, నోవోటెల్ వంటివి గ్రాండ్ గాలా డిన్నర్స్, లైవ్ బ్యాండ్స్, రూఫ్‌‌‌‌టాప్ పార్టీలతో సెలబ్రేషన్స్‌‌‌‌ను ఎలివేట్ చేస్తున్నాయి. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్​ లో న్యూ ఇయర్​ కౌంట్​డౌన్ ​పేరుతో జరుగుతున్న ఈవెంట్​కు డీజే ప్రత్యూష, పరిచా మ్యూజిక్​ టీమ్​ వచ్చి లైవ్​ బ్యాండ్​ మోత మోగించనున్నది.

ప్రిజమ్ ​అవుట్​డోర్స్​ నిర్వహించే ఈవెంట్​కు సింగర్​ సునిత, ఆర్పీ పట్నాయక్​ రానున్నారు. సుభ ఆరంభం పేరుతో ద విలేజ్​ఆర్క్​వారు నిర్వహిస్తున్న ఈవెంట్​కు హైపర్​ఆది తన టీమ్​తో వచ్చి నవ్వులు పూయించనున్నాడు.