
రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్ చివరి కోరిక అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్సార్ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ పొందిన నేత అన్నారు అని.. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు వైస్సార్ అని చెప్పారు. రాహుల్ గాంధీనీ ప్రధాని చేసినప్పుడే వైఎస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుందన్న రేవంత్ రెడ్డి.. వైఎస్సార్ గొప్ప రాజనీతజ్ఞుడు అన్నారు. వైఎస్సార్ కి హైదరబాద్ లో స్మృతి వనం లేకపోవడం అవమానకరం అన్నారు. కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్న ప్రభుత్వం .. అలాగే వైఎస్సార్ స్మృతి వనం నిర్మించాలన్నారు. లేకపోతే 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైఎస్సార్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైఎస్సార్ స్ఫూర్తి తో పని చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.