వెదర్ అలర్ట్: రాష్ట్రానికి భారీ వర్ష సూచన

వెదర్ అలర్ట్: రాష్ట్రానికి భారీ వర్ష సూచన
  • తెలంగాణ వెదర్ అప్‌డేట్స్
  • రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • జూన్ 4 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు

హైదరాబాద్ : రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణశాఖ. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.  ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయంది. ఈ నెల 29న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఇవాళ కేరళతో పాటు కర్ణాటకలోకి కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు. వచ్చే రెండు మూడ్రోజులలో కర్ణాటకలోని కొంకన్, గోవా ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు.  గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చండూర్ లో ఈదురుగాలులతో భారీ వర్షం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మల్‌చెల్మలో 3.3 సెం.మీ, ఖమ్మం జిల్లా కొణిజర్లలో 3.2 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. అత్యధికంగా కోల్‌బెల్ట్ ప్రాంతమైన రామగుండంలో పగటిపూట 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు.   

మరిన్ని వార్తల కోసం

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

కృష్ణా నీళ్లు ఆంధ్రకు.. గోదావరి జలాలు కాంట్రాక్టర్లకు