ఏ స్తోత్రానికి ఎంత పవర్​.. ఎలాంటి ప్రయోజనమో తెలుసా..

ఏ స్తోత్రానికి ఎంత పవర్​.. ఎలాంటి ప్రయోజనమో తెలుసా..

భారతీయ సనాతన ధర్మంలో భగవతారాధన చాలా ప్రత్యేకమైనది. కర్మఫలంగా జీవిస్తూ  వారి జీవన విధానంలో అనేక సుఖ దుఃఖాలకు లోనవుతారు.భగవంతుడిని స్మరించుకోవడం కోసం అనువైన మార్గం స్త్రోత్రాలు పఠించడం. శక్తివంతమైన ఈ మంత్రాలు జపించడం వల్ల అధ్యాత్మికంగా బలపడతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు, జీవితంలో ఏర్పడేటువంటి బాధలకు, కష్టాలకు, దుఃఖాల నుండి బయటపడటానికి మన రుషుల ద్వారా పురాణాల ద్వారా అధ్యాత్మిక గురువులైనటువంటి శంకరాచార్యులవారు అలాగే వేద వ్యాసుల వంటి రుషుల ద్వారా, పురాణాల ద్వారా  అనేక స్తోత్రాలు మనకు అందించారు. ఏ స్తోత్రమును పారాయణ చేయడం వలన ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చో తెలుసుకుందాం. . .

పనులలో విజయం పొందాలంటే గణనాయకాష్టకం చదవాలి. జ్ఞానం, భక్తి తత్వం పొందేందుకు, శివ అనుగ్రహం పొందడానికి శివాష్టకం చదవాలి. ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది. కోరికలు నెరవేరడానికి శ్రీరాజరాజేశ్వరి అష్టకం, అన్నానికి, ఆహారమునకు లోటు ఉండకుండా అన్నపూర్ణ అష్టకం, అధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం పొందడానికి కాలభైరవ అష్టకం పఠించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

మానసిక భయాందోళనలు, బుద్ధి వికాసము కోసం దుర్గ అష్టోత్తర శతనామం, జ్ఞానం, విద్య పొందడానికి విశ్వనాథ అష్టకం పఠించాలి.  కుజదోషం, కాలసర్పదోషం, పాప నాశనం కొరకు సుబ్రహ్మణ్యం అష్టకం, శని బాధలు, పిశాచపీడ తొలగడానికి హనుమాన్‌ చాలీసా చదవాలని తెలిపారు. పాపనాశనం, వైకుంఠ ప్రాప్తికై విష్ణు శతనామ స్తోత్రం పఠించాలి.  సత్ప్రవర్తన, సత్పురుష ప్రాప్తి శివ అష్టకం చదవాలని, సర్వ శుభప్రాప్తికి భ్రమరాంబిక అష్టకం, పాపనాశనానికి శివషోడక్షరి స్తోత్రం, ఆపద, పీడ తొలగడానికి లక్ష్మీనరసింహ స్తోత్రం చదవాలి.

కోటి జన్మపాప నాశనం పోవడానికి కృష్ణ అష్టకం, భార్యాభర్తల అన్యోన్యతకు ఉమామహేశ్వర స్తోత్రం, హనుమాన్‌ కటాక్షం సిద్ధించడానికి శ్రీ రామరక్ష స్తోత్రం, కీర్తి లలిత పంచరత్నం, వాక్‌శుద్ధికి శ్యామాల దండకం పఠించాలని  ఆధ్యాత్మికవేత్తలు  తెలిపారు. సర్వజ్ఞాన ప్రాప్తికై త్రిపుర సుందరి స్తోత్రం పఠించాలి. రథ గజ తురంగ ప్రాప్తికై శివ తాండవ స్తోత్రం పఠించాలి. శని పీడ నివారణకు శని స్తోత్రం, శత్రు నాశనం చేయడానికి మహిషాసుర మర్ధిని స్తోత్రం, రుణ బాధలు తీరడానికి అంగారక రుణ విమోచన స్తోత్రం, నష్ట ద్రవ్యలాభం పొందడానికి కార్యవీర్యార్జున స్తోత్రం, ఆర్థిక వృద్ధికి కనకధార స్తోత్రం, ధన లాభం పొండానికి శ్రీ సూక్తం, సామ్రాజ్య సిద్ధికి సూర్య కవచం, శత్రు నాశనానికి సుదర్శన మంత్రం చదవాలి.

అశ్వమేధయాగ ఫలం పొందడానికి విష్ణు సహస్ర నామ స్తోత్రం, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు రుద్రకవచం, శని బాధలు తొలగడానికి శని స్తోత్రం, ఈతిబాధలు తొలగడానికి దక్షిణ కాళీ స్తోత్రం, మనశ్శాంతి, మానసిక బాధలకు భువనేశ్వరి కవచం, పిశాచ పీడ నివారణకు వారాహి స్తోత్రం, పిశాచ పీడ నివారణకు దత్త స్తోత్రం, సర్వార్థ సిద్ధికి లలిత సహస్రనామం చదవాలని సూచించారు. నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.