
కాఫీ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రస్తుతానికి బ్రెజిల్, వియత్నాం, కొలంబియా వంటి దేశాలు కాఫీ ఉత్పత్తిలో టాప్ లో ఉన్నాయి. 2024-25లో కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారిగా ఉంది. అయితే గత 11 ఏళ్లలో భారతదేశ కాఫీ ఎగుమతులు బాగా పెరిగాయి. జూన్ 2025లో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా 2025/26 మొదట్లో కాఫీ ఎగుమతులు ఏడాదికి 25 శాతం పెరిగాయని, గడిచిన కొన్నేళ్లలో చూస్తే ఎగుమతులు 125 శాతం పెరిగాయి. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా 2034 నాటికి మన దేశ కాఫీ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని చేస్తుంది. ఈ టార్గెట్ చేరుకుంటే భారతదేశం నాలుగవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
అయితే విద్యా కాఫీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ కోడిములే మాట్లాడుతూ భారతదేశ కాఫీ బోర్డు లక్ష్యాలను మించి ప్రపంచంలోని టాప్ మూడు ఉత్పత్తిదారులలో ఒకటిగా మారే సామర్థ్యం ఉందని నమ్ముతున్నారు. భారతదేశంలో దాదాపు మొత్తం కాఫీ పంటలు చాలా ప్రత్యేకమైన పద్ధతిలో పండిస్తారు. వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల రకరకాల రుచులతో కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. మన దేశంలో కాఫీ వినియోగం, ముఖ్యంగా ఆర్గానిక్ & స్పెషాలిటీ కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది.
విద్యా కాఫీ గ్రీన్ కాఫీ (పచ్చి గింజలు) ఎగుమతిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది, ముఖ్యంగా యూరప్, మిడిల్ ఈస్ట్, కొరియాకు. 'రుతుపవన' కాఫీలకు (మాన్‌సూన్డ్ కాఫీ) డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కాఫీ బోర్డ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర వంటి ఉత్తర ప్రాంతాలలో కూడా కాఫీ సాగును ప్రోత్సహిస్తోంది. విద్యా కాఫీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 40వేల టన్నులకు విస్తరించడంతో పాటు, కర్ణాటక ప్లాంట్ స్థానికులకు 500 కంటే పైగా కొత్త ఉద్యోగాలను కల్పించింది.
అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం స్పెషాలిటీ-గ్రేడ్ బీన్స్ ఉత్పత్తి చేయడానికి కాఫీ పెంపకందారులలో ఆసక్తి పెరిగింది. తేమతో కూడిన, తీరప్రాంత వాతావరణంలో పండించే మంగళూరు ప్రాంతం నుండి సీజనల్ కాఫీలపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ వ్యాపారం ప్రస్తుతం భారతదేశంలో ప్రతి సంవత్సరం 20వేల టన్నుల గ్రీన్ కాఫీని ప్రాసెస్ చేస్తుంది, అదనంగా 5000 టన్నుల ఆఫ్రికన్ కాఫీని ఉగాండాలోని ప్రాసెస్ చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న ఉత్పత్తి, నాణ్యత, సుస్థిరతపై దృష్టి, కాఫీ బోర్డు సహకారంతో భారతదేశం భవిష్యత్తులో ప్రపంచ కాఫీ పరిశ్రమలో కీలక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.