సన్‌రైజర్స్‌కు డు ఆర్ డై మ్యాచ్

సన్‌రైజర్స్‌కు డు ఆర్ డై మ్యాచ్

ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్ స్థానాల కోసం జట్లు భీకరంగా తలపడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్ కు చేరుకోగా, మిగిలిన  స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టఫ్ స్విచువేషన్ లో  పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తో  డు ఆర్ డై మ్యాచ్ ఆడబోతుంది.  ప్రస్తుతం 12 మ్యాచుల్లో 5 విజయాలు, 7  ఓటములతో 10 పాయింట్లు సాధించిన కేన్ టీమ్ కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రోహిత్ సేనపై తప్పక గెలవాల్సిన పరిస్థితి. అటు ముంబై.. ఈ మ్యాచ్ లో గెలిచినా,  ఓడినా పోయేదేమి లేదు. ఎందుకంటే  ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 


జట్ల బలాబలాలను గమనిస్తే:
హైదరాబాద్ ఇన్నింగ్స్ ను అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్  ఓపెన్ చేస్తారు. గత మ్యాచ్ లో అభిషేక్ 28 బంతుల్లో 43 పరుగులతో రాణించడం జట్టుకు ప్లస్ పాయింట్. అయితే మరో  ఓపెనర్ కేన్ విలియమ్సన్ ఆటగాడిగా, కెప్టెన్ గా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా అతను మునుపటి ఫాంను అందిపుచ్చుకుంటాడో లేదా చూడాలి. మిడిలార్డర్ లో రాహుల్ త్రిపాటి, మార్కరమ్, నికోలస్ పూరన్ ఆడటం ఖాయం. రాహుల్ త్రిపాటి గత 12 గేముల్లో 317 రన్స్ సాధించగా, మార్కరమ్ 12 మ్యాచుల్లో 358 రన్స్ కొట్టాడు. వీరిద్దరు  మంచి ఫాంలో ఉండటం జట్టుకు మేలు చేకూరే అంశం. ఈ ఇద్దరు చెలరేగితే మాత్రం ముంబై బౌలర్లకు చుక్కలే. నికోలస్ పూరన్ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. లోయర్ ఆర్డర్ లో వాషింగ్టన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. బౌలింగ్ లోనూ అతను భారీగా పరుగులు ఇస్తున్నాడు. శశాంక్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నా, అతను భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. మార్కో జాన్సన్ ఈ సీజన్ లో పూర్తిగా విఫమయ్యాడని చెప్పాలి. బ్యాటింగ్ లో ఫేలవడంతో పాటు, బౌలింగ్ లో కేవలం 7 వికెట్లే తీసుకున్నాడు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తుది జట్టులో ఉంటారు. హైదరాబాద్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ బెటర్ గా ఉందని చెప్పొచ్చు. భువీ ఈ సీజన్ లో 12 మ్యాచుల్లో 11 వికెట్లు తీసుకోగా, నటరాజన్ 10 గేముల్లో  18 వికెట్లు సాధించాడు. అటు ఉమ్రాన్ మాలిక్ అయితే నిప్పులు చెరుగుతున్నాడు. వీరు రాణిస్తే మాత్రం ముంబై బ్యాట్సమన్ విలవిల్లాడాల్సిందే. 
 
ముంబై జట్టులో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ వస్తారు. వీరిద్దరు మోస్తారుగా ఆడుతున్నారు.  అయితే ఇషాన్ కిషన్ పర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఫాం లేమితో తంటాలు పడుతున్నాడు. మిడిలార్డర్ లో తిలక్ వర్మ సూపర్ ఫాంలో ఉన్నాడు. కానీ రమణదీప్ సింగ్ రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించింది లేదు. ఇక త్రిస్టాన్ స్టబ్స్ కు ఇది ఫస్ట్ మ్యాచ్. లోయర్ ఆర్డర్ లో టీమ్ డేవిడ్, హృతిక్ షోకీన్ డానియల్ సామ్స్ తుది జట్టులో ఉంటారు. ఈ ముగ్గురు స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. బౌలింగ్ లో బుమ్రా, కార్తికేయ, రిలే మెరిడిత్ ఆడటం పక్కా.  అయితే బుమ్రా మాత్రమే వికెట్లు తీసుకుంటూ ఎకానమీని కంట్రోల్ చేసుకుంటున్నాడు. కార్తీకేయ వికెట్లు సాధిస్తున్నా, ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. అటు మెరిడిత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. 

రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎవరిది పైచేయి:
ముంబై, హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచులు జరిగితే అందులో ముంబై 10, హైదరాబాద్ 8 మ్యాచుల్లో గెలుపొందాయి. 

వాంఖడే పిచ్ ఎలా ఉండబోతుంది:
ఈ మ్యాచ్ సాయంత్ర 7 గంటల 30 నిమిషాలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్ పిచ్. పిచ్  పై బౌన్స్ వల్ల బౌలర్లకు సహకరిస్తుంది. షార్ట్ బౌండరీల వల్ల బ్యాట్సమన్ ఈజీగా పరుగులు చేయవచ్చు. ఇక్కడ చివరగా జరిగిన 8 మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టే ఆరు సార్లు గెలవడం విశేషం. సో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జట్ల బలాబలాలు, ఆటగాళ్ల ఫాం ప్రకారం ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కు 60 శాతం, ముంబైకు 40 శాతం గెలుపు అవకాశాలున్నాయని చెప్పొచ్చు. 

మరిన్ని వార్తల కోసం 

వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా..?