ఏప్రిల్ 1 నుంచి ఆఫీసులకు రావాల్సిందే

ఏప్రిల్ 1 నుంచి ఆఫీసులకు రావాల్సిందే

కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక ఆఫీసులకు వెళ్లి పనిచేయొచ్చని తెలంగాణ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోమ్ కే పరిమితమై ఐటీ ఉద్యోగులు త్వరలో ఆఫీసుల బాట పట్టనున్నారు. ఏప్రిల్ 1 నుంచి కార్యాలయాల్లో పని చేసేందుకు సన్నద్ధం కావాలని ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి మెసేజ్ లు పంపుతున్నాయి. హైదరాబాద్ ఐటీరంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతి గృహాల్లో చేరడానికి వీలుగా కంపెనీలు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రెండు వ్యాక్సిన్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా ప్రాజెక్టుల వారీగా రప్పించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఒక ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా ..గ్రూపులుగా విభజించనున్నాయి. తొలుత వారినికి 2 నుంచి మూడు రోజులు కార్యాలయాల్లో, మిగతా రోజులు ఇంటి నుంచి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తల కోసం

 

మోడీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రత్యేక హోదా ఇచ్చినం

అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు