మోడీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రత్యేక హోదా ఇచ్చినం

మోడీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రత్యేక హోదా ఇచ్చినం
  • కాంగ్రెస్ చేసిన తప్పుకు కఠిన శిక్ష విధించాలె
  • ప్రజలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపు

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్.. ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గతంలో ప్రపంచ వేదికలపై భారత్ గళాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు యావత్ ప్రపంచమంతా మన మాట వింటోందని చెప్పారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్ నాథ్ ఇవాళ కప్కోట్ లో జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి.. ప్రత్యేక హోదా ఇచ్చారని, కానీ ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హోదాను రద్దు చేసిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన ఈ నేరానికి ఆ పార్టీకి కఠిన శిక్ష విధించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాఖండ్ కు మళ్లీ ప్రత్యేక హోదాను పునరుద్ధరించామని గుర్తు చేశారు. అటల్ జీ ఇచ్చిన ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు రద్దు చేసిందనే దానిపై ప్రతి ఒక్కరూ నిలదీయాలన్నారు.

కాగా, ఫిబ్రవరి 14న ఒకే దశలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మార్చి 10న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ లో 2017 ఎన్నికల్లో బీజేపీ 56 సీట్లలో గెలిచి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తల కోసం..

ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు క‌ల‌పండి

అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు

పైలట్ లేకుండా ఎగిరిన హెలికాప్టర్