ట్రయల్ రన్ సక్సెస్: పైలట్ లేకుండా ఎగిరిన హెలికాప్టర్

ట్రయల్ రన్ సక్సెస్: పైలట్ లేకుండా ఎగిరిన హెలికాప్టర్

ఇప్పటి వరకు డ్రైవర్ లెస్ కార్లు, డ్రైవర్ లెస్ బస్సుల గురించి విని ఉంటాం. కానీ తొలిసారి పైలట్ లేని హెలికాప్టర్.. ఆకాశంలోకి ఎగిరింది. అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీతో అమెరికా కంపెనీ సికోర్స్కీ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ పైలట్ లెస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను రూపొందించింది. అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫోర్ట్ క్యాంప్ బెల్ లో తొలిసారిగా ఈ నెల 5న 30 నిమిషాలపాటు ట్రయల్ రన్ నిర్వహించింది. 4000 అడుగుల ఎత్తు వరకు ఎగిరిన పైలట్ లెస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అయింది. గంటకు 185 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. 

అమెరికా డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్  లో భాగంగా ఈ అన్ మ్యాన్డ్ హెలికాప్టర్ల అభివృద్ధిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎయిర్ క్రూ లేబర్ ఇన్ కాక్ పిట్ ఆటోమేషన్ సిస్టమ్ (అలియాస్ Alias) టెక్నాలజీతో దీనిని డెవలప్ చేశారు. తొలుత ఈ హెలికాప్టర్ లను కమర్షియల్, మిలిటరీ ఆపరేషన్లలో వినియోగించనున్నట్లు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ స్టౌర్ట్ యంగ్ తెలిపారు. అననుకూల వాతావరణంలో రిస్కీ ఆపరేషన్లు చేసే సమయాల్లో ఇవి ఉపయోగపడుతాయని, టెక్నాలజీ సాయంతో ప్రమాదాలను తప్పించవచ్చని అన్నారు. మిలిటరీ పహారా కోసం కూడా రాత్రింబవళ్లు పైలట్లు లేకుండా వీటిని ఆపరేట్ చేయొచ్చని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

‘హమారా బజాజ్’ రాహుల్ కన్నుమూత

దేశం ఎవని అయ్య సొత్తు కాదు

రాహుల్ పుట్టుకపై తప్పుగా మాట్లాడడం సంస్కారమేనా?