దేశం ఎవని అయ్య సొత్తు కాదు

దేశం ఎవని అయ్య సొత్తు కాదు

మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందన్నారు సీఎం కేసీఆర్. రాయగిరి బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్  ..పిచ్చి ముదిరే మోడీ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెచ్చారన్నారు. ఏడాదిపాటు రైతులను ఏడిపించారన్నారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులన్నారు. ఢిల్లీ బార్డర్ లో రైతులను చిత్రహింసలు పెట్టారన్నారు. రైతుల తరపున కరెంట్ బిల్లు తానే కడతానన్నారు కేసీఆర్. మోడీకి మెంటలెక్కి పిచ్చెక్కి రైతులతో  పెట్టుకుంటున్నాడన్నారు. నరేంద్ర మోడీని తరిమి తరిమి కొట్టాలన్నారు. మెడమీద కత్తిపెట్టి బోర్లకాడ మీటర్లు పెట్టాలని ఒత్తడి చేస్తున్నారన్నారు.. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే డబ్బులిస్తామంటున్నారన్నారు. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి చేశామన్నారు. కొట్లాడాలా? ఇంట్ల పండుకోవాల్నా అని ప్రశ్నించారు కేసీఆర్. 

వాస్తవాల్ని ప్రశ్నిస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఏ సంగతి చూస్తవ్ తోకమట్టనా అని అన్నారు కేసీఆర్. మోడీ సిగ్గుపడాలన్నారు. దేశం ఎవని అయ్య సొత్తు కాదు..నాశనం చేస్తే చేతులు ముడుచుకోరన్నారు. సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. బీజేపీ నుంచి దమ్మున్న ఏ  మొనగాడో తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో 15, 16 లక్షల పరిశ్రమలుమూతపడ్డాయన్నారు. మోడీ వల్ల దేశంలో ఎవరికి లాభం జరిగిందన్నారు. తెలివి తక్కువ బీజేపీ పాలనలో దేశం నాశనం అయ్యిందన్నారు. దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లుంటే.. 35 వేల టీఎంసీలు కూడా వాడటం లేదన్నారు. దేశంలో ఆకలి పెరుగుతుందన్నారు.115 దేశాల్లో సర్వే చేస్తే మన దేశం స్థానం 101 అని అన్నారు. భారత దేశాన్ని ఆకలి రాజ్యాన్ని చేస్తరా అని ప్రశ్నించారు కేసీఆర్.

కరోనా సమయంలో మీ గొప్ప పరిపాలనలో పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలుతాయా అని ప్రశ్నించారు. మోడీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల అనేక మంది రోడ్ల మీద నడిచారన్నారు. బీజేపీ దొంగలతో జాగ్రత్తగా ఉండాలన్నారు.‘ నా ప్రాణం తెలంగాణ,.. నా బతుకు నేను బతుకుతున్నా..నేను చచ్చినా సరే కేంద్ర విద్యుత్ సంస్కరణలను తెలంగాణలో అమలు చెయ్య.. జనగామ సభలో నా మాటలకు బీజేపీ నేతలకు లాగులు తడిసాయి. బీజేపీకి సంస్కాముందా? కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టుకపై అస్సాం ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడడం సంస్కారమా? హిందు ధర్మమా ?. సంస్కారహీనంగా మాట్లాడిన అస్సాం సీఎంను బర్త్ రఫ్ చేయాలి. బీజేపీ 8 ఏళ్లలో ఏకానా పనిచేయలేదన్నారు. అన్నిరంగాల్లో అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ బీజేపీ అని అన్నారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతిపిందె బీజేపీ  అని అన్నారు కేసీఆర్.