అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్  అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రాహుల్ బజాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. రాహుల్ బజాజ్ మృతి వార్త తెలిసి తాను చాలా బాధపడ్డానని, ఆయన కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రామ్ నాథ్ అన్నారు. దేశ పారిశ్రామిక రంగంలో గొప్పగా ఎదిగిన ఆయన.. తన ఎదుగుదలతో పాటు దేశ ప్రగతి కోసం కూడా పాటుపడ్డారని అన్నారు. ఆయన మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటని అన్నారు. 


రాహుల్ బజాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన విశేష కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఆయన సమాజానికి కూడా ఎంతో సేవ చేశారన్నారు. అలాగే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా రాహుల్ బజాజ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత రాహుల్ బజాజ్ (83) శనివారం  కన్నుమూశారు. కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. నిమోనియాతో పాటు హృద్రోగ సమస్యలు ఉన్న రాహుల్ బజాజ్ గత నెలలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని పుణేలోని రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ తెలిపారు. రాహుల్ బజాజ్.. 1938 జూన్ 10న జన్మించారు. దాదాపు 40 ఏండ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్ గా వ్యవహరించిన ఆయన.. బజాజ్ కంపెనీ ప్రతి ఇండియన్ సొంతం చేసుకునేలా ‘హమారా బజాజ్’తో టూవీలర్ ను తీర్చిదిద్దారు. ఆయన తాత జమ్నాలాల్ బజాజ్ స్థాపించిన ఈ కంపెనీని దేశంలో టాప్ వెహికల్ కంపెనీగా నిలిపడంలో రాహుల్ బజాజ్ పాత్ర ఎంతో కీలకం. అయితే ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. ఆయన మృతి పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

పైలట్ లేకుండా ఎగిరిన హెలికాప్టర్

దేశం ఎవని అయ్య సొత్తు కాదు

రాహుల్ పుట్టుకపై తప్పుగా మాట్లాడడం సంస్కారమేనా?