పోలీస్ స్టేషన్ ఎదుట రూ.500 నోట్లు వేసిన మహిళ.. రోడ్డుపై రచ్చ రచ్చ

పోలీస్ స్టేషన్ ఎదుట రూ.500 నోట్లు వేసిన మహిళ.. రోడ్డుపై రచ్చ రచ్చ

మధ్య ప్రదేశ్ లో ఓ వృద్దురాలు వినూత్నంగా నిరసన తెలిపింది.  తన కుమారుడు హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించింది.  తనను పట్టించుకోవాలని రోడ్డుపై ట్రాఫిక్ ఆపి.. పోలీసులను ఆకర్షించేందుకు రోడ్డుపై రూ. 500 నోట్లను విసిరేసింది.

తనను తన కుమారుడు పట్టించుకోకుండా హింసకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదును పట్టించుకోకుండా... పోలీసులు తన కుమారుడిని లంచం తీసుకున్నారని ఆరోపించింది.  ప్రజలను కాపాడాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారని.. తాను బహిరంగంగా లంచం ఇస్తాననే ధోరణిలో రోడ్డుపై రూ. 500 నోట్లను విసిరేసింది. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు సమర్దవంతంగా పాలించడం లేదని ఆరోపించింది. 

రోడ్డుపై వాహనాలను అకస్మాత్తుగా ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కరెన్సీ నోట్లను విసిరిన తరువాత గురువారం (జూన్ 15) రాత్రి  నీముచ్ కాంట్ పోలీస్ స్టేషన్ ఎదుట  హైవోల్టేజ్ డ్రామా జరిగింది. మే నెలలో తన కుమారుడు దారుణంగా కొట్టాడంతో.. చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు  చేయడానికి ప్రయత్నించినట్లు బాధిత వృద్దురాలు తెలిపింది.  కాని పోలీసులు తనను పట్టించుకోలేదని.. తన మాటను అసలు వినలేదని ఆవేదన వ్యక్తం చేసింది.  తన కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండేందుకు పోలీసులు  లంచం తీసుకున్నారని ఆమె ఆరోపించింది. 


https://twitter.com/FreePressMP/status/1669597832658178049