వీడియో వైరల్ : బిడ్డకు పాలు అడిగితే... చితక్కొట్టారు

వీడియో వైరల్ :  బిడ్డకు పాలు అడిగితే... చితక్కొట్టారు

మధ్యప్రదేశ్ లో హృదయ విదారక ఘటన ఒకటి  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఏ తల్లైనా బిడ్డల కడుపు నింపేందుకు  పడే పాట్లు అంతా ఇంతా కాదు. అయితే బెగ్గర్ల పరిస్థితి, మతిస్థిమితం లేని వ్యక్తుల పరిస్థితి  మరీ దారుణంగా ఉంటుంది.  వారు కూడా ఎలాగైనా తమ పిల్లల ఆకలిని తీర్చేందుకు పలు మార్గాలను అన్వేషిస్తారు.  ఇప్పుడు అలాగే మధ్యప్రదేశ్  సాగర్ లో ఓ మహిళ తన బిడ్డకు పాలు అడిగినందుకు ముగ్గురు వ్యక్తులు కర్కోటకులు ( రాక్షసులు)గా మారి.. దారుణంగా చితక్కొట్టారు.   ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

 మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒక మహిళను బస్టాండ్‌లో దారుణంగా కొట్టారు. గత నెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో మహిళను కర్రలతో కొట్టి, ముఖంపై తన్నినట్లు కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో బస్టాండ్‌లో మహిళను దారుణంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో గురువారం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.వైరల్ అయిన ఆ వీడియోలో.. బాధిత మహిళను ఈడ్చుకెళ్లి, కర్రలతో కొట్టారు. ముఖంపై తన్నారు. ఆ సమయంలో ఆమె ఐదు నెలల పసికందును సమీపంలో నేలపై పడుకోబెట్టి ఉంది. ఇదంతా వీడియోలో చూపించారు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒక మహిళను బస్టాండ్‌లో దారుణంగా కొట్టారు. గత నెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో మహిళను కర్రలతో కొట్టి, ముఖంపై తన్నినట్లు కనిపిస్తోంది.

దీనికి సంబంధించి నిందితులుగా ప్రవీణ్ రైక్వార్ (26), విక్కీ యాదవ్ (20), రాకేష్ ప్రజాపతి (40)లను గోపాల్‌గంజ్ పోలీసులు గురువారం( ఆగస్టు31)  అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ లోకేష్ సిన్హా తెలిపారు.  పోలీసులు నిందితులను కోర్టుకు తీసుకెళుతున్న సమయంలో రోడ్డుపై పరేడ్ చేయిస్తూ తీసుకెళ్లారు. కోర్టు వీరికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఆగస్టు 12-13 మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన బస్టాండ్‌లోని క్యాంటీన్‌లో పాలు కొనేందుకు ఆ మహిళ వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. క్యాంటీన్‌లోని ముగ్గురు వ్యక్తులు ఆమెను కొట్టారని పోలీసులు తెలిపారు.ఆ వీడియోలో ఆమె తనను కొడుతున్న వారిని దీనంగా వేడుకుంటూ... ‘భయ్యా.. భయ్యా’ అంటూ ఏడుస్తున్నట్లు కనిపించింది. చుట్టుపక్కల వారు ఆమెను కొట్టవద్దని నిందితులను ఆపడం, అరవడం వినిపించింది.   ఆ మహిళకు మతిస్థిమితం సరిగా లేదని భావిస్తున్నట్లు సాగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ తివారీ పేర్కొన్నారు. 

ఈ వీడియోని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆకలితో ఉన్న బిడ్డకు పాలు పట్టించినందుకు మహిళను హోటల్ సిబ్బంది దారుణంగా కొట్టారు అంటూ క్యాప్షన్ జోడించింది. మధ్యప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ వీడియో ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. శివరాజ్‌ని తొలగించండి, కుమార్తెలను రక్షించండి అంటూ క్యాప్షన్ జోడించింది.  పసిపాపకు పాలు అడిగితే దారుణంగా వ్యవహరించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.