
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన గుడాటిపల్లికి చెందిన మహిళలు, యువతులు ఆర్అండ్ఆర్ప్యాకేజీ పంపిణీలో అన్యాయం చేస్తున్నారని గురువారం నిరసన దీక్షకు దిగారు. గుడాటిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. పెండ్లిళ్లు అయ్యాయనే కారణంతో పునరావాస ప్యాకేజీ లిస్ట్‌లోని తమ పేర్లను అధికారులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
2015 నుంచి 2021 వరకు మేజర్లు, పెండ్లిళ్లు అయిన యువతులందరికీ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.